ప్రముఖ హాస్యనటుడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం 'బజార్ రౌడి'. వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా మోషన్ పోస్టర్ను చిత్రబృందం హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో విడుదల చేసింది.
పాటతో అల్లరి నరేశ్.. ఫస్ట్‌లుక్‌తో సంపూ - Sampoornesh babu Bazar Rowdy
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన 'బజార్ రౌడి' చిత్రం నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. అలాగే 'నాంది' నుంచి మొదటి పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం.
పాటతో అల్లరి నరేశ్.. ఫస్ట్‌లుక్‌తో సంపూ
అల్లరి నరేశ్ హీరోగా నటించిన చిత్రం 'నాంది'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేశారు. 'చెలి' అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించగా కారుణ్య, హరిప్రియ ఆలపించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 19న ఈ చిత్రం విడుదల కానుంది.