ప్రేమలో ఉన్నప్పుడు పాడుకునే పాటలు ఎన్నో ఉన్నాయి. ప్రేమ విఫలం అయినపుడు పాటలు కాదు కదా మాటలే రావు. మౌనమే దానికి వేదికవుతుంది. అందుకే ప్రియురాలి గురించి అందంగా చెప్పే పాటలే ఎక్కువగా వస్తాయి. "ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం" వంటి ప్రేమికుడి బాధను వ్యక్తపరిచే అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. 'రొమాంటిక్' చిత్రంతో రచయిత భాస్కరభట్ల రవికుమార్ ఇలాంటి అవకాశాన్ని స్వీకరించాడు. 'నా వల్ల కాదే' అనే విరహ గీతం యువ హృదయాలను తాకుతుంది. ఆకాష్ పూరి కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రమిది. కేతికా శర్మ కథానాయిక.
ఒంటరవడం.. మంటల్లో దూకడం ఒకటే కదా! - na valla kade fron romantic
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తోన్న చిత్రం 'రొమాంటిక్'. కేతికా శర్మ కథానాయిక. తాజాగా ఈ సినిమాలోని 'నా వల్ల కాదే' అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం.
తాజాగా ఈ పాటను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చిత్రబృందం. ప్రేయసి దూరమైనపుడు ప్రేమికుడు పడే బాధని వర్ణించిన తీరు హత్తుకుంటుంది. "కళ్ల నుంచి నీరు లాగ నువ్వు జారగ.. కాళ్ల కింద భూమి జారినట్టుందిగా, నే ఒంటరవడం.. మంటల్లో దూకడం ఒకలాంటిదే కదా" అంటూ సాగే సాహిత్యం మెప్పిస్తోంది. స్వీయ సంగీత దర్శకత్వంలో ఈ పాటను చక్కగా ఆలపించాడు సునీల్ కశ్యప్. అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం. పూరి జగన్నాథ్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు.
ఇవీ చూడండి.. నోరా ఫతేహి కేశాలంకరణకు అంత ఖర్చా..!