తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అల్లు అర్జున్ కొత్త సినిమా టైటిల్​పై క్లారిటీ - Seshachalam

అల్లు అర్జున్​-సుకుమార్​ కొత్త సినిమా టైటిల్​పై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన పేరుపై జరుగుతున్న ప్రచారాన్ని ట్విట్టర్​ ద్వారా ఖండించింది.

Mythri-Movie-Makers-Post-On-AA20-Title
అల్లు అర్జున్ కొత్త సినిమా టైటిల్​పై చిత్రబృందం క్లారిటీ

By

Published : Jan 20, 2020, 8:26 PM IST

Updated : Feb 17, 2020, 6:45 PM IST

స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్‌ - సుకుమార్‌ల కలయికలో 'ఆర్య', 'ఆర్య-2' చిత్రాల తర్వాత ముచ్చటగా మూడో చిత్రం రాబోతోంది. 'ఏఏ20' వర్కింగ్​ టైటిల్​తో సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా ఇప్పటికే కేరళలో కొంత మేర చిత్రీకరణ జరుపుకొంది. తాజాగా ఈ మూవీ టైటిల్​పై సామాజిక మాధ్యమాల్లో ఓ చర్చ నడుస్తోంది. దీనిపై స్పందించింది చిత్రబృందం.

ఈ చిత్రానికి సుక్కు బృందం 'శేషాచలం' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ విషయంపై ట్విట్టర్‌ వేదికగా క్లారిటీ ఇచ్చింది నిర్మాణ సంస్థ. "అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రానికి ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. కొన్ని మీడియా సంస్థల్లో, సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారం నిజం కాదు. టైటిల్‌ ఖరారవ్వగానే అధికారికంగా ప్రకటిస్తాం" అని చిత్రబృందం ట్వీట్​ చేసింది.
Last Updated : Feb 17, 2020, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details