నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ చిత్రం ప్రకటించారు. 'NBK 107' వర్కింగ్ టైటిల్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు 'ఆ టైటిల్ ఖరారు చేశారు', 'ఈ పేరు పెట్టారంటూ' గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. దీనిపై చిత్రబృందం బుధవారం స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని, అలాంటి రూమర్లు నమ్మొద్దని ఓ ప్రకటన విడుదల చేసింది.
"NBK 107' సినిమా పేరు గురించి వస్తున్న వార్తలు అవాస్తవమైనవి. సరైన సమయంలో మేమే టైటిల్ అధికారికంగా ప్రకటిస్తాం. మరిన్ని అప్‌డేట్లు అందిస్తాం' అని మైత్రీమూవీ మేకర్స్ పేర్కొంది.