తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కెరీర్​లో ఆ విషయాలను పట్టించుకోను: రాశి - రాశీఖన్నా కొత్త సినిమా అప్​డేట్స్

జీవితంలో ఆశావాహ దృక్పథంతో అడుగేయడమే తన బలమని చెబుతోంది హీరోయిన్​ రాశీఖన్నా. సినిమాల్లో ఎంతో ఆర్భాటంగా కనిపించినా.. ఇంట్లో మాత్రం చాలా సాధారణంగా గడుపుతానని అంటోంది.

My strength is to go with an optimistic outlook, Says Raashi Khanna
కెరీర్​ ఒడుదుడుకులపై కలవరం లేదు: రాశి

By

Published : Dec 21, 2020, 9:05 AM IST

ఉందిలే మంచి కాలం ముందు ముందునా... అంటోంది కథానాయిక రాశీ ఖన్నా. ఆశావాహ దృక్పథంతో అడుగేయడమే నా బలం అని చెబుతోందామె. తెలుగుతోపాటు తమిళంలోనూ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్న రాశీ.. ఇటీవల తరచూ ఫొటో షూట్‌లతో సందడి చేస్తోంది. గ్లామర్‌ ప్రపంచంలో ఉంటూ తెరపైనా, బయట ఎంత ఆర్భాటంగా కనిపించినా.. ఇంట్లో మాత్రం చాలా సాధారణంగా గడుపుతుందట రాశి.

రాశీఖన్నా

"కెమెరా ముందు ఉన్నప్పుడే నేను నటిని. ఇంట్లో మాత్రం నేను నా చుట్టూ వాతావరణం చాలా సాధారణంగా ఉంటుంది. నా అవసరాలు కూడా అలాగే ఉంటాయి. చదువుతూనో లేదంటే నాతో నేను గడుపుతూ నిశ్శబ్దంగానో ఉంటాను. ఆధ్యాత్మిక ప్రభావమేమో తెలియదు కానీ... కెరీర్‌లో ఒడుదొడుకుల గురించి కూడా కలవరం చెందను. ఉత్తమమైనది ఇంకా ముందు ఉందనే ఒక నమ్మకం నన్నెప్పుడూ వదిలిపెట్టదు" అని చెప్పింది రాశి.

రాశీఖన్నా
రాశీఖన్నా

ఇదీ చూడండి:'ఒడిశా అమ్మాయికి లవ్​లెటర్స్​ రాశా'

ABOUT THE AUTHOR

...view details