బాలకృష్ణ, బోయపాటి శీను కలయికలో రాబోతున్న 'అఖండ'(Akhanda movie budget) చిత్రంలో అతి క్రూరమైన ప్రతినాయకుడి పాత్రలో నటించినట్లు ప్రముఖ నటుడు శ్రీకాంత్(akhanda srikanth look) తెలిపారు. తన పాత్ర కోసం సుమారు 40 రకాల ఆహార్యాలు చూశారని, అందులో ఒకటి బాలకృష్ణ ఎంపిక చేసినట్లు చెప్పారు. శ్రీరామరాజ్యం తర్వాత బాలకృష్ణతో కలిసి ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందన్న ఆయన.. బోయపాటి 'అఖండ'ను(balakrishna boyapati srinu new film) భారీ స్థాయిలో రూపొందించారని, తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దసరాకు(Akhanda Movie Release Date) ఈ మూవీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
మరిచిపోలేని అనుభూతి
దీంతో పాటే తన తనయుడు రోషన్ 'పెళ్లిసందడD'(pelli sandadi movie 2021) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం ఆనందంగా ఉందన్నారు శ్రీకాంత్. నాటి పెళ్లిసందడి రోజులను ఈ చిత్రం మరిపిస్తుందన్నారు. తాను 23 ఏళ్ల వయస్సులో 'పెళ్లిసందడి' చిత్రంలో నటిస్తే తన కుమారుడు(pelli sandadi movie hero) 22 ఏళ్ల వయస్సులో రాఘవేంద్రరావు పిలిపించి అవకాశం ఇవ్వడం మరిచిపోలేని అనుభూతిని కలిగించిందన్నారు. రోషన్ చిత్రాన్ని తెరపై చూడటానికి ఎంతో ఆతృతంగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్న ఆయన.. ఈ దసరాకు(pelli sandadi movie release date) ఆ సినిమా థియేటర్లలో రాబోతుందని తెలిపారు.