తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నా భర్తతో ప్రియమణి వివాహం చెల్లదు' - ప్రియమణి, ముస్తఫా వివాహం చెల్లద

సీనియర్ నటి ప్రియమణి, ముస్తఫా రాజ్​ల వివాహం చెల్లదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ముస్తఫా మొదటి భార్య ఆయేషా. తాను, ముస్తఫా ఇప్పటివరకు విడాకులు తీసుకోలేదని వెల్లడించారు.

Priyamani
ప్రియమణి

By

Published : Jul 22, 2021, 6:14 PM IST

సీనియర్ నటి ప్రియమణి, ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్​ను 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే అంతకుముందే ఆయనకు ఆయేషా అనే భార్య ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ పెళ్లి అయిన కొంతకాలం తర్వాత విడిపోయారు. అనంతరం ప్రియమణి, ముస్తఫా కలిసి ఉంటున్నారు. తాజాగా వీరి వివాహం చెల్లదంటూ మాట్లాడారు ఆయన మొదటి భార్య ఆయేషా. తాము ఇంకా విడాకులు తీసుకోలేదని, ముస్తఫా తనకు మాజీ భర్త కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ వ్యాఖ్యలపై స్పందించారు ప్రియమణి.

ముస్తఫా, ప్రియమణి

"మాది చట్టవిరుద్ధ సంబంధం కాదు. అందువల్ల మా బంధానికి వచ్చే ప్రమాదమేమీ లేదు. ముస్తఫా భర్తగా దొరకడం నా అదృష్టం. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. మేమిద్దరం రోజూ ఫోన్లో మాట్లాడుకుంటాము. కొందరు మా రిలేషన్​పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారికి చెప్పేదొకటే. మేము చాలా అన్యోన్యంగా ఉన్నాం. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు."

-ప్రియమణి, నటి

2010లో ఆయేషాను వివాహమాడారు ముస్తఫా రాజ్. వీరికి ఇద్దరు పిల్లలూ ఉన్నారు. కొన్నేళ్లపాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ తర్వాత మనస్పర్థలతో విడిపోయింది. అప్పటి నుంచి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. వారి పిల్లల కోసం ఇప్పటికీ ముస్తఫా ప్రతి నెల కొంత మొత్తం పంపిస్తున్నారు.

ఇవీ చూడండి: రాజ్ కుంద్రా కేసులో శిల్పా శెట్టిపై విచారణ!

ABOUT THE AUTHOR

...view details