తెలంగాణ

telangana

By

Published : May 14, 2021, 8:27 AM IST

ETV Bharat / sitara

'నా తప్పులు బయటపడ్డాయి.. త్వరలో తెరంగేట్రం'

తనపై వచ్చిన క్యాస్టింగ్ కౌచ్, ర్యాష్ డ్రైవింగ్ ఆరోపణలపై స్పందించాడు నటుడు రానా సోదరుడు అభిరామ్. తప్పులు అందరూ చేస్తుంటారని.. కాకపోతే తన తప్పులు బయటకు వచ్చాయని తెలిపాడు.

Abhiramm
అభిరామ్

తప్పులు అందరూ చేస్తుంటారని.. కాకపోతే తాను చేసిన కొన్ని తప్పులు బయటకు వచ్చాయని నటుడు రానా సోదరుడు అభిరామ్‌ తెలిపాడు. మరి కొన్నిరోజుల్లో నటుడిగా వెండితెరకు పరిచయం కానున్న ఇతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉందని తెలిపాడు. ముఖ్యంగా ప్రేమ, కుటుంబకథా చిత్రాలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు.

"తేజ దర్శకత్వం వహించనున్న సినిమాతో నటుడిగా వెండితెరకు ఎంట్రీ ఇవ్వనున్నా. ఆయన సినిమాలో నటించడం నాకెంతో ఆనందంగా ఉంది. అలాగే ఒకింత భయం కూడా ఉంది. తేజ సర్‌ వర్క్‌ ఎలా ఉంటుందో 'నేనే రాజు నేనే మంత్రి' సమయంలోనే అర్థమైంది. 'నన్ను హీరోగా మీరే పరిచయం చేయాలి సర్‌' అని ఆ సినిమా షూట్‌లో ఆయనతో అంటుండేవాడిని. ఆయన కూడా నీకోసం తప్పకుండా ఓ కథ రాస్తానని చెప్పేవారు. అలా, ఇటీవల ఓ కథ రాసి నాన్నకు చూపించారు. అది నాన్నకు బాగా నచ్చింది. దాంతో నేను నటుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నా. కొవిడ్‌ తీవ్రత కొద్దిగా తగ్గుముఖం పట్టాక సెట్‌లోకి అడుగుపెడతా" అని తెలిపాడు అభిరామ్.

అనంతరం తనపై వచ్చిన క్యాస్టింగ్‌ కౌచ్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌ ఆరోపణల పై స్పందిస్తూ.. "తప్పులందరూ చేస్తారు. నేను చేసిన తప్పులు బయటపడ్డాయి. వాటి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. అలాంటి సమయంలో కుటుంబం నాకు అండగా నిలబడింది. ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదు? అనే విషయాలు ఇప్పుడు నాకు బాగా తెలిశాయి. నటుడిగా కెరీర్‌ ప్రారంభించడానికి ముందే ఇలా జరగడం వల్ల భవిష్యత్తులో అలాంటి తప్పులు చేయకూడదని అర్థమైంది" అని అభిరామ్‌ చెప్పుకొచ్చాడు.

ABOUT THE AUTHOR

...view details