తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నా జీవితంలో జరిగినవన్నీ అనూహ్యమే!' - ప్రగ్యా జైస్వాల్​ వార్తలు

చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత తన ఆలోచనల్లో మార్పు వచ్చినట్లు చెబుతోంది హీరోయిన్​ ప్రగ్యా జైస్వాల్​. ఆ ఆలోచనల నుంచి వచ్చిన అనుభవాలతో ప్రతిరోజూ పరిపూర్ణమవుతుందని అభిప్రాయపడింది. అయితే తన జీవితంతో పాటు సినీ ప్రయాణంలోనూ అనూహ్యంగా జరిగిన పరిణామాలే ఎక్కువని చెబుతోంది.

my life is unpredictable, Says Pragya Jaiswal
'నా జీవితంలో జరిగినవన్నీ అనూహ్యమే!'

By

Published : May 3, 2021, 8:21 AM IST

వ్యక్తిగత జీవితంలోనే కాదు.. తన సినీ ప్రయాణంలోనూ అనూహ్యంగా జరిగిన పరిణామాలే ఎక్కువని అంటోంది హీరోయిన్​ ప్రగ్యా జైస్వాల్‌. మనం ఏమాత్రం ఊహించకుండా వచ్చే అవకాశాలు ఎక్కువ తృప్తితోపాటు, ఎక్కువ బాధ్యతనీ పెంచుతాయని చెబుతోందామె. ప్రస్తుతం ఆమె బాలకృష్ణతో కలిసి 'అఖండ'లో నటిస్తోంది. హిందీలోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. బాలకృష్ణతో కలిసి నటించే అవకాశమూ ఈమెకు అనూహ్యంగానే దక్కింది.

"తొలినాళ్లల్లో పేరున్న నటులు, దర్శకులతో కలిసి నటించాలని ఆశించేదాన్ని. అందుకు తగ్గట్టుగానే తక్కువ సమయంలోనే అలాంటి ఎక్కువ అవకాశాలు సొంతం చేసుకున్నా. ఆ తర్వాత నేను ఊహించకుండానే.. విభిన్నమైన కథల్లోనూ, పాత్రల్లోనూ నటించే అవకాశం దొరికింది. అవి మరో రకమైన అనుభవాన్నీ, సంతృప్తినీ పంచాయి. ఇప్పుడు నా ఆలోచనల్లోని పరిణతి, అనుభవం ప్రతి రోజునీ మరింత పరిపూర్ణంగా ఆస్వాదించేందుకు కారణం అవుతున్నాయ"ని ప్రగ్యా జైస్వాల్​ చెప్పుకొచ్చింది.

ఇదీ చూడండి:అల్లు అర్జున్​ దర్శకుడితో నితిన్​ కొత్త చిత్రం!

ABOUT THE AUTHOR

...view details