తెలంగాణ

telangana

By

Published : Jul 17, 2020, 1:05 PM IST

Updated : Jul 17, 2020, 3:53 PM IST

ETV Bharat / sitara

అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు: బిగ్​బీ

కరోనా నుంచి తను కోలుకోవాలని పూజలు చేసిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు​ అమితాబ్​ బచ్చన్​. సామాజిక మాధ్యమాలు అన్నింటిలో వచ్చిన సందేశాలను చూశానని చెప్పారు.

My gratitude has no bounds: Big B thanks fans for their recovery prayers
అమితాబ్​ బచ్చన్​

బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్.. కరోనా సోకడం వల్ల, ప్రస్తుతం ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు​. తాను కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేసిన అభిమానులందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ప్రతిఒక్కరి సందేశాల ద్వారా వారి ప్రేమను పొందినట్లు ట్విట్టర్​ వేదికగా బిగ్​బీ పంచుకున్నారు​.

"మా శ్రేయస్సు కోసం ప్రేమతో మీరు చేస్తున్న ప్రార్థనలను, మీ ఆశీస్సులను అందుకున్నా. ఎస్​ఎంఎస్​, వాట్సాప్​, ఇన్​స్టాతో పాటు ఇతర సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్స్ అన్నింటిలోనూ మీ సందేశాలను చూశాను, విన్నాను. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. హాస్పిటల్​ ప్రోటోకాల్ పరిమితుల మేరకు ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. లవ్​యూ ఆల్.​"

-అమితాబ్​ బచ్చన్​, బాలీవుడ్ ప్రముఖ నటుడు

కరోనా కాలంలోనూ నిరంతరంగా శ్రమిస్తున్న వైద్యులు, నర్సులను ట్విట్టర్​ వేదికగా అభినందించారు అమితాబ్.

బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​, ఆయన కుమారుడు అభిషేక్​ బచ్చన్​లకు గత శనివారం, కరోనా పాజిటివ్​గా తేలింది. అనంతరం కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా.. ఐశ్వర్యరాయ్, బిగ్​బీ మనవరాలు ఆరాధ్యలకూ వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. అదృష్టవశాత్తు అమితాబ్ భార్య జయా బచ్చన్​కు నెగిటివ్​గా​ తేలింది.

ఇదీ చూడండి:ముంబయి పోలీసులకు సోనూసూద్ 'మాస్క్​' సాయం

Last Updated : Jul 17, 2020, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details