తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నా ఫేవరెట్​ హీరో ఆయనే: అనన్యా పాండే - ananya pandey upcoming movies

బాలీవుడ్ స్టార్​ షారుక్​ ఖాన్ తనకిష్టమైన​ హీరో అని చెప్పింది నటి​ అనన్యా పాండే.. చిన్నప్పటి నుంచి బాద్​షా​ సినిమాలు చూస్తూ పెరిగినట్లు తెలిపింది. అలాగే బంధుప్రీతి(నెపోటిజమ్​)​ గురించి కూడా మాట్లాడింది.

ananya pandey
అనన్య పాండే

By

Published : Nov 3, 2021, 7:25 AM IST

తనకు ఎంతో ఇష్టమైన నటుడు షారుక్‌ ఖాన్‌ అంటోంది యువ కథానాయిక అనన్యా పాండే. సినిమాలు, ప్రకటన చిత్రాల షూటింగులతో తీరిక లేకుండా గడిపేస్తుంది. తనకు ఇష్టమైన నటుడు గురించి మాట్లాడుతూ "షారుక్‌ నా అభిమాన హీరో. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. నాకు సినిమా నిర్వచనం అంటే షారుక్‌" అని చెప్పింది. మంగళవారం షారుక్‌ ఖాన్‌ పుట్టినరోజు. ఇటీవలే ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఈసారి షారుక్‌ వేడుకలకు దూరంగా ఉన్నారు.

అనన్య పాండే

బాలీవుడ్‌ నటుడు చుంకీ పాండే కూతురుగా వెండితెరకు పరిచయమైన అనన్య.. నెపోటిజమ్‌ గురించి మాట్లాడింది. "ప్రేక్షకులకు కావల్సింది మంచి సినిమా. వాళ్లను అలరించే నటులు ఎవరైనా ఫర్వాలేదు. ఆ నటుల అమ్మ ఎవరు? నాన్న ఎవరు? సినిమా నేపథ్యం ఉందా? ఇవేవీ దృష్టిలో పెట్టుకుని సినిమా చూడరు" అని చెప్పింది.

ప్రస్తుతం అనన్య దృష్టంతా 'లైగర్‌' చిత్రంపైనే ఉంది. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రమిది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని ఓ కీలకమైన పాటను ఇటీవలే పూర్తి చేసింది అనన్య.

ఇదీ చూడండి: అనన్య.. అందమైన పాలరాతి పుష్పమా!

ABOUT THE AUTHOR

...view details