కథానాయకుడు అజయ్ దేవగణ్‌తో పెళ్లికి తన నాన్న(షోమ్ ముఖర్జీ) ఒప్పుకోలేదని బాలీవుడ్ నటి కాజోల్ చెబుతోంది. ఆమె నటించిన 'త్రిభంగ' శుక్రవారం(జనవరి 15)విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాల్ని పంచుకుంది.
"నిజ జీవితంలో ఆడ-మగ అనే లింగబేధం లేకుండానే పెరిగాను. 24వ ఏటా అజయ్‌తో పెళ్లి అని చెప్పినప్పుడు, నాన్న ఒప్పుకోలేదు. ఇంకొన్నాళ్లు నటించాలని చెప్పారు. అమ్మ మాత్రం నా అభిప్రాయానికి మద్దతు పలికింది. నీకు మనసులో ఏది అనిపిస్తుందో అదే చెయ్యమని చెప్పింది. నా చట్టుపక్కల ఉన్నవారు నా వెనుకే నిలబడ్డారు. అందువల్లే అనుకున్న పని చేయగలిగాను. 'త్రిభంగ' చిత్రంలో అను(కాజోల్) ప్రేమను, ద్వేషాన్ని, అలవాట్లను చాలా లోతుగా చూస్తుంది. నాలోని లక్షణం అది. మూడు తరాల మహిళల మధ్య చోటుచేసుకున్న ఓ కుటుంబ సంఘటనల నేపథ్య కథతో ఈ సినిమా తీశాం" అని కాజోల్ చెప్పింది.