Thaman about Aravinda samehta movie: టాలీవుడ్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న తమన్.. గతంలో ఓ పాట కోసం ఎంతో కష్టపడి పనిచేసినట్లు తెలిపారు. కానీ, దానికి అనుకున్నంత స్థాయి గుర్తింపు రాలేదని వివరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఈ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.
'అరవింద సమేతలోని ఆ పాట కోసం చాలా కష్టపడ్డా.. కానీ!'
Thaman about Aravinda samehta movie: గతంలో తాను కంపోజ్ చేసిన ఎన్టీఆర్ 'అరవింద సమేత'లోని ఓ సాంగ్ కోసం ఎంతో కష్టపడి పనిచేసినట్లు తెలిపారు సంగీత దర్శకుడు తమన్. కానీ, దానికి అనుకున్నంత స్థాయి గుర్తింపు రాలేదని, అందుకు తాను చాలా బాధపడినట్లు వివరించారు. ఇంతకీ ఆ గీతం ఏంటంటే?
"ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన 'అరవిందసమేత'(NTR Aravanida samehta movie) ఆల్బమ్ అంటే నాకెంతో ఇష్టం. ముఖ్యంగా 'ఏడ పోయినాడో' అనే పాట కోసం ఎంతో కష్టపడి వర్క్ చేశాను. అందులో విభిన్నమైన భావోద్వేగాలు ఉంటాయి. ఆ పాట పాడటం కోసం వైజాగ్ నుంచి నిఖిత శ్రీవల్లి అనే సింగర్‌ను పిలిపించాం. ఎంతోమంది వాయిస్‌లు టెస్ట్ చేశాం. కానీ, ఆ అమ్మాయి వాయిస్ మాత్రమే ఆ పాటకు సెట్ అయ్యింది. సినిమా విడుదలయ్యాక తప్పకుండా ఆ పాటకు మంచి గుర్తింపు వస్తుందని భావించాను. 'రెడ్డమ్మతల్లి', 'పెనివిటి' పాటలకు వచ్చినంత ప్రశంసలు ఈ పాటకు రాలేదు. అప్పుడు కొంచెం బాధగా అనిపించింది. అలాగే నేను ట్యూన్స్ కాపీ కొడుతున్నానంటూ కొన్ని సందర్భాల్లో విమర్శలు వస్తుంటాయి. అవి విన్నప్పుడు కొంత బాధగా ఉంటుంది. ఆ బాధ, కోపం పోగొట్టుకోవడానికి వెంటనే గ్రౌండ్‌కి వెళ్లి క్రికెట్ ఆడతా. పాటలకు అనుకున్నంత మంచిగా ట్యూన్స్ రాకపోయినా సరే వెంటనే గ్రౌండ్‌కు వెళ్లిపోతా" అని తమన్ వివరించారు.
ఇదీ చూడండి:'ప్రభాస్‌తో అందుకే కుదరలేదు.. త్వరలోనే కలిసి పనిచేస్తాం'