'సామజవరగమనా', 'బుట్టబొమ్మా', 'రాములో రాములా' అంటూ అటు క్లాస్, ఇటు మాస్ ప్రేక్షకుల్ని గతేడాది తన సంగీతంతో అలరించారు సంగీత దర్శకుడు తమన్. 'అల వైకుంఠపురములో', 'వకీల్‌సాబ్' పాటలతోపాటు 'వి' నేపథ్య సంగీతంతో ఆయన మాంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే సంగీత దర్శకుడిగా ఆయనకు వరుస సినిమా అవకాశాలు వరించాయి. దీంతో ఆయన ఈ ఏడాది మొత్తం రికార్డింగ్స్‌తో పూర్తి బిజీగా మారనున్నారు. ఒకటి కాదు రెండు కాదు మొత్తం పది ప్రాజెక్ట్‌లు ప్రస్తుతానికి తమన్ చేతిలో ఉన్నాయి. అంతేకాకుండా మరో ఐదు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమన్ చేతిలో ఉన్న కీలకమైన కొన్ని ప్రాజెక్ట్‌ల గురించే ఈ స్టోరీ.
తమన్ సాబ్‌కు ఇది కీలకం..
తమన్ చేతిలో ఉన్న సినిమాల్లో ఓ కీలకమైన ప్రాజెక్ట్ 'వకీల్‌సాబ్'. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ రీఎంట్రీ సినిమా కావడం వల్ల దర్శక నిర్మాతలతోపాటు సంగీత దర్శకుడిపై కూడా ఒత్తిడి కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. ప్రేక్షకుల్ని అలరించేలా పాటల్ని అందించడం కోసం తమన్ ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'మగువా మగువా' పాట సినీ ప్రియుల్ని ఆకర్షించింది.
సర్కారు కోసం ఎలాంటి పాటలిస్తారో..
దాదాపు ఆరేళ్ల తర్వాత మహేశ్‌బాబు-తమన్ కాంబోలో రానున్న చిత్రం 'సర్కారువారి పాట'. 'దూకుడు', 'ఆగడు' తర్వాత మహేశ్ కోసం ఆయన కంపోజ్ చేస్తున్న చిత్రమిదే. సంగీతపరంగా సూపర్‌స్టార్ అభిమానుల పల్స్ తెలుసుకున్న తమన్ ఈ సినిమా కోసం అద్భుతమైన ట్యూన్స్ అందించడానికి సిద్ధమవుతున్నారు.
మాస్ కోసం ప్రత్యేకంగా..