తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కళావతి' సాంగ్​కు తమన్.. 'శ్రీవల్లి' పాటకు బాబు మోహన్​​ స్టెప్పులు! - sridevei drama company

Thaman kalavathi song: మహేశ్​బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమాలో తాను కంపోజ్​ చేసిన 'కళవతి' సాంగ్​కు స్టెప్పులేశారు సంగీత దర్శకుడు తమన్​. కాగా, 'పుష్ప'లోని 'శ్రీవల్లి' పాటకు నటుడు బాబు మోహన్​ డ్యాన్స్​ వేశారు. దాన్ని మీరూ చూసేయండి..

Music Director thaman dance for Kalavathi song
కళావతి సాంగ్​కు తమన్

By

Published : Feb 23, 2022, 10:09 AM IST

Updated : Feb 23, 2022, 10:33 AM IST

Thaman kalavathi song: సూపర్​ స్టార్​ మహేశ్​బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమాలోని కళావతి సాంగ్​ ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్​లోనూ ట్రెండింగ్​లో దూసుకుపోతుంది. ఎక్కడ చూసిన ఈ పాటే వినపడుతుంది. చాలా మంది ఈ గీతానికి రీల్స్​ చేస్తూ సోషల్​మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు.

ఈ పాటను కంపోజ్​ చేసిన​ సంగీత దర్శకుడు తమన్​పైనా మహేశ్​ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే శేఖర్​ మాస్టర్​తో కలిసి కళావతి పాటకు స్టెప్పులేసి ఆశ్చర్యపరిచారు తమన్​. దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట్లో పోస్ట్​ చేయగా వైరల్​గా మారింది. విపరీతంగా లైక్స్​, కామెంట్స్​ వస్తున్నాయి.

మహేశ్​బాబు 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేశ్ హీరోయిన్​గా నటించింది. తమన్ సంగీతమందించగా, పరశురామ్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. మే 12న సినిమా విడుదలకానుంది.

'పుష్ప' సాంగ్​కు బాబు మోహన్​ డ్యాన్స్​

Sridevi drama company babu mohan dance: ఈటీవీలో ప్రసారమయ్యే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కార్యక్రమానికి బాబు మోహన్‌తోపాటు సీనియర్‌ నటీమణులు అన్నపూర్ణ, శ్రీలక్ష్మి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అతిథులు- యాంకర్‌ సుధీర్‌, రామ్‌ ప్రసాద్‌ మధ్య సాగిన సంభాషణలు, డ్యాన్స్‌ ప్రదర్శనలు, సన్మానాలతో ప్రోమో అలరిస్తోంది. అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమాలోని ‘శ్రీవల్లి’ పాట డ్యాన్స్‌ ఫెర్ఫామెన్స్‌తో బాబు మోహన్‌ అలరించారు. బస్‌ జర్నీ స్కిట్‌తో కడుపుబ్బా నవ్వించారు. అనంతరం, సన్మాన వేడుకనుద్దేశించి మాట్లాడుతూ "మా బాబు గుర్తొచ్చాడు. ఇప్పుడు నేను ఆ ఫొటోల గురించి చెప్పలేను. అప్పుడు అస్థిపంజరంలా మారాను. చనిపోవాలనుకున్నా" అని అన్నారు.

ఇదీ చూడండి: సాయికుమార్​ను కొట్టాలనుకున్నా!: సినీనటుడు వినోద్​కుమార్

Last Updated : Feb 23, 2022, 10:33 AM IST

ABOUT THE AUTHOR

...view details