సైబరాబాద్ కమిషనరేట్‌లో ప్లాస్మా దానంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ప్లాస్మా సంజీవనితో సమానం: ఎమ్.ఎమ్.కీరవాణి - ప్లాస్మా దానం కార్యక్రమంలో పాల్గొన్న కీరవాణి వార్తలు
ప్లాస్మా అనేది ప్రాణాలు కాపాడే సంజీవనితో సమానమని ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి పేర్కొన్నారు. ప్లాస్మా దానంపై అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని సూచించారు.
ప్లాస్మా సంజీవనితో సమానం: ఎమ్.ఎమ్.కీరవాణి
కొవిడ్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి పేర్కొన్నారు. ప్లాస్మా అనేది ప్రాణాలు కాపాడే సంజీవనితో సమానమని తెలిపారు. ప్లాస్మా దాతలందరూ ప్రాణదాతలని కొనియాడారు. ఈ విషయంలో అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దన్న ఆయన.. మా కుటుంబం, సిబ్బంది ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.