తాను అనుకున్నది సాధించే వరకు పట్టువదలని విక్రమార్కుడిలా శ్రమిస్తారు దర్శకధీరుడు రాజమౌళి. దాని కోసం ఎంత సమయమైనా కేటాయిస్తారు. అందుకే ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ బాక్సాఫీసు వద్ద రికార్డులు తిరగరాస్తాయి. రాజమౌళి విజయంలో సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ ఇద్దరు కలిస్తే ఆ కిక్కే వేరు. రాజమౌళి కథకు కీరవాణి అందించే నేపథ్య సంగీతం మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది.
'రాజమౌళిలో నాకు నచ్చని విషయం అదే' - రాజమౌళి కీరవాణి న్యూస్
దర్శకధీరుడు రాజమౌళిలో ఓ విషయం ఇప్పటికీ నచ్చదని సంగీత దర్శకుడు కీరవాణి అన్నారు. అలా చేయొద్దని ఎవరు చెప్పినా వినిపించుకోడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఓ ఇంటర్వ్యూలో రాజమౌళిలో తనకు నచ్చిన, నచ్చని విషయాలు పంచుకున్నారు కీరవాణి. రాజమౌళి ఏకాగ్రత, అతనిలోని పట్టుదల, ఏదైనా సరే నేర్చుకోవాలనే తపన ఇష్టమట. నచ్చని విషయానికొస్తే.. రాజమౌళి ఎక్కువగా చిన్న పిల్లల చిత్రాలు చూస్తుంటాడని, అవి కాకుండా ముఖ్యమైన సినిమాలు కొన్ని వీక్షించమని చెప్పినా పట్టించుకోడని తెలిపారు. ఎంతమంది చెప్పినా వినిపించుకోకుండా దూరంగా వెళ్లి చూస్తుంటాడని, అదే రాజమౌళిలో నచ్చని విషయమని సరదాగా చెప్పుకొచ్చారు కీరవాణి.
ఇదీ చూడండి..''ఆర్‌ఆర్‌ఆర్'కు ఎదురైన అతిపెద్ద సవాల్ అదే'