టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుల్లో దేవీశ్రీప్రసాద్ ఒకరు. అనేక భారీ బడ్జెట్ చిత్రాలకు బాణీలను అందించిన ఘనత ఆయన సొంతం. స్టార్ హీరోల వరుస సినిమాలకు సంగీతాన్ని అందించారు. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ - దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్లో అనేక హిట్ ఆల్బమ్స్ ఉన్నాయి. 'జల్సా', 'గబ్బర్ సింగ్', 'అత్తారింటికి దారేది' పాటలు సూపర్హిట్లుగా నిలిచాయి.
పవన్ చిత్రానికి దేవీశ్రీ భారీ రెమ్యునరేషన్! - పవన్ చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవీశ్రీప్రసాద్
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవీశ్రీప్రసాద్‌ను ఎంపిక చేశారు. దీని కోసం దేవీ భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారట.
పవన్ - హరీశ్ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ భారీ రెమ్యునరేషన్!
ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ - దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవీశ్రీప్రసాద్‌ను ఎంపిక చేశారు. దీని కోసం దేవీ ఏకంగా రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దేవీ గతంలో కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్ తీసుకునేవారట.