ఇటీవల మరణించిన దిగ్గజ గాయని లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం సంగీత అకాడమీని ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ముంబయి యూనివర్సిటీలోని కలీనా క్యాంపెస్‌లో దీనిని నిర్మిస్తామని తెలిపింది.
ముంబయి శివాజీ పార్క్‌లో లతా మంగేష్కర్ పేరిట స్మారక చిహ్నాన్ని నిర్మించాలని.. కొన్నిరోజుల క్రితం భాజపా ఎమ్మెల్యే రామ్‌కదమ్.. ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. ప్రస్తుతం శివాజీ పార్క్‌లో బాలాసాహెబ్ ఠాక్రే స్మారక చిహ్నం ఉంది.
మరోవైపు, లతా మంగేష్కర్ పుట్టిన ఊరు ఇండోర్‌లో ఆమె పేరిట మ్యూజియం సహా సంగీత అకాడమీని ఏర్పాటు చేస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఆమె పుట్టినరోజున కళాకారులకు రాష్ట్రీయ అవార్డులను అందిస్తామని పేర్కొంది.
కొవిడ్ పాజిటివ్‌గా తేలడం వల్ల లతా మంగేష్కర్.. జనవరి 8న ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స అందించిన క్రమంలో కొద్దిరోజులకు కోలుకున్నారు. శ్వాస సంబంధిత సమస్య తీవ్రమవటం వల్ల 28 రోజుల చికిత్స అనంతరం ఆదివారం ఉదయం లత తుదిశ్వాస విడిచారు. నేడు(గురువారం) లతా మంగేష్కర్ హస్తికలను ఆమె కుటుంబసభ్యులు నాసిక్ రాంకుండ్లోని గోదావరి నదిలో కలిపారు.
లతా మంగేష్కర్ హస్తికలను నాసిక్ రాంకుండ్లోని గోదావరి నదిలో కలిపారు లతా మంగేష్కర్ హస్తికలను నాసిక్ రాంకుండ్లోని గోదావరి నదిలో కలిపారు ఇవీ చదవండి: