తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బన్నీతో నిజమే.. క్లారిటీ ఇచ్చిన మురగదాస్‌ - murugadas to direct allu arjun here is the clarity

ప్రముఖ దర్శకుడు మురగదాస్​తో స్టైలిష్ స్టార్ ఓ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై ఈ దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.

murugadas
బన్నీ

By

Published : Jan 5, 2020, 2:45 PM IST

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌తో ప్రముఖ దర్శకుడు మురగదాస్‌ ఓ సినిమా చేయబోతున్నట్లు ఆ మధ్య కోలీవుడ్‌, టాలీవుడ్‌లో వార్తలు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా 'దర్బార్‌' రాబోతుంది. సంక్రాంతి కానుకగా 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఈ దర్శకుడు ఈ సినిమా విశేషాలు పంచుకుంటూ తన తర్వాతి ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చాడు.

"అల్లు అర్జున్‌తో సినిమా అనుకున్న మాట నిజమే. కథ విషయమై కూడా చర్చించాం. అయితే ఇది కార్యరూపం దాల్చడానికి మరింత టైం పట్టే అవకాశముంది. ప్రస్తుతం ఆయన కూడా తన సినిమాలతో బిజీగా ఉన్నారు కదా."
-మురగదాస్, దర్శకుడు

మొత్తానికి మురగదాస్‌ చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. 'ఐకాన్‌' తర్వాత స్టైలిష్‌ స్టార్‌ చిత్రం ఈ స్టార్‌ దర్శకుడిదే అయ్యే అవకాశాలున్నాయి.

ఇవీ చూడండి.. గుసగుస: విజయ్​కు అంత పారితోషికమా..!

ABOUT THE AUTHOR

...view details