తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మర్డర్​' సినిమా కేసు విచారణ 24కు వాయిదా - amrutha case on murder movie

ప్రణయ్​ హత్య ఆధారంగా రూపొందుతున్న చిత్రం మర్డర్​పై అమృత వేసిన దావాపై విచారణను నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయస్థానం... మరోసారి కేసును వాయిదా వేసింది.

'మర్డర్​' సినిమా కేసు విచారణ 24కు వాయిదా
'మర్డర్​' సినిమా కేసు విచారణ 24కు వాయిదా

By

Published : Aug 20, 2020, 12:14 AM IST

రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న మర్డర్ సినిమాకు సంబంధించిన కేసు విచారణను... నల్గొండలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయస్థానం... మరోసారి కేసును వాయిదా వేసింది. మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసు ఆధారంగా నిర్మితమవుతున్న మర్డర్ చిత్రం నిలిపివేయాలంటూ... అమృత గత నెలలో సివిల్ దావా వేశారు.

జీవిత కథల్ని తెరకెక్కించే విధానంలో భాగంగానే మర్డర్ చిత్రాన్ని తీస్తున్నట్లు... దర్శకుడు, నిర్మాత తరఫు న్యాయవాది ఇంతకు ముందే కోర్టుకు తెలియజేశారు. దీంతో తదుపరి ఉత్తర్వులు జారీ చేసేందుకు కేసును న్యాయస్థానం... మరోసారి వాయిదా వేసింది.

ఇదీ చూడండి :లంచం కేసులో అధికారుల కస్టడీకి అనిశా పిటిషన్

ABOUT THE AUTHOR

...view details