వెండితెర సోగ్గాడు శోభన్‌బాబు సలహా పాటించడం వల్లే తాను ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్నానని ప్రముఖ నటుడు మురళీమోహన్ చెప్పారు. నటుడిగా, వ్యక్తిగతంగా ఆయన ఎంతో గొప్ప మనిషని గుర్తుచేసుకున్నారు.
శోభన్‌బాబు 85వ జయంతిని పురస్కరించుకుని వంశీ గ్లోబల్ అవార్డ్స్ అమెరికా- ఇండియా ఆధ్వర్యంలో ఆన్లైన్లో వేడుకలను నిర్వహించారు. అమెరికా గానకోకిల శారద ఆకునూరి పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో సీనియర్ నటి జమునతోపాటు ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి, నటులు మురళీమోహన్, చంద్రమోహన్, దర్శకులు రేలంగి నర్సింహారావు, తదితరులు పాల్గొని శోభన్‌బాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.