తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నటన నుంచి రాజకీయ నాయకుడిగా 'వారాలబ్బాయ్​'

సినిమాతో పాటు వివిధ రంగాల్లో తనదైన ముద్రవేశారు టాలీవుడ్​ సీనియర్​ నటుడు మురళీ మోహన్. నేడు (జూన్​ 24) మురళీ మోహన్​ పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రత్యేక కథనం.

By

Published : Jun 24, 2020, 8:00 AM IST

MURALI MOHAN BIRTHDAY SPECIAL STORY
నటన నుంచి రాజకీయ నాయకుడిగా 'వారాలబ్బాయ్​'

సినిమా, వ్యాపార, రాజకీయ రంగాలపై తనదైన ముద్రవేశారు మురళీమోహన్‌. క్రమశిక్షణ, పట్టుదలతో ఆయా రంగాల్లో జయభేరి మోగించారు. ఏలూరు సమీపంలోని చాపర్రులో (1940, జూన్‌ 24) జన్మించారు. మురళీమోహన్‌ 1963లోనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు.

సినీ విశేషాలు

విజయవాడలో నాటకాలతో అనుబంధం ఏర్పడటం వల్ల... అది సినిమా రంగ ప్రవేశానికి దారితీసింది. 1973లో 'జగమే మాయ' చిత్రంతో ప్రయాణం ఆరంభించిన ఆయన, 1974లో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన 'తిరుపతి'తో నటుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకొన్నారు. కథానాయకుడిగా వందలాది చిత్రాల్లో నటించి విజయాల్ని సొంతం చేసుకొన్నారు. 1980లో సోదరుడు కిషోర్‌తో కలిసి, సొంత నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్స్‌ ప్రారంభించారు.

మురళీ మోహన్​.. తన వందో చిత్రమైన 'వారాల అబ్బాయ్‌'ని నిర్మించారు. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాలు ఆ సంస్థ నుంచి ప్రేక్షకుల ముందుకొచ్చాయి. జయభేరి గ్రూప్‌ పేరుతో భవన నిర్మాణరంగంలోనూ అడుగుపెట్టి విజయాల్ని సొంతం చేసుకొన్నారు.

సేవారంగంలో

తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన 2009లో రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో పరాజయాన్ని చవిచూశారు. 2014లో మాత్రం విజయాన్ని సొంతం చేసుకొన్నారు. మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పాటు సేవలందించారు. నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌.ఎఫ్‌.డి.సి), ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎ.పి.ఎఫ్‌.డి.సి)లలో వివిధ పదవులు చేపట్టి సేవలందించారు.

ABOUT THE AUTHOR

...view details