మాస్కు ధరించకుండా బైకు నడిపినందుకు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్పై ముంబయి పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రేమికుల దినోత్సవం రోజు తన భార్యతో కలసి బైక్పై చక్కర్లు కొడుతున్న వీడియోను వివేక్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అందులో ఆయన హెల్మెట్, మాస్కు లేకుండా కనిపించారు.
మాస్క్ పెట్టుకోలేదని బాలీవుడ్ హీరోపై ఎఫ్ఐఆర్ - మూవీ న్యూస్
మాస్క్ ధరించనందుకు ముంబయి పోలీసులు నటుడు వివేక్ ఒబెరాయ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హెల్మెట్ పెట్టుకోనందుకు రూ.500 జరిమానా కూడా విధించారు.
నటుడు వివేక్ ఒబెరాయ్
దీంతో పోలీసులు కరోనా నిబంధనల ఉల్లంఘన కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం సహా హెల్మెట్ వాడనందుకు రూ.500 జరిమానా విధించారు. మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మాస్కు ధరించని వారిపై కేసులు పెడతామని ఇప్పటికే ముంబయిలోని అధికారులు హెచ్చరించారు.
Last Updated : Feb 20, 2021, 8:51 AM IST