కరోనా వైరస్ కారణంగా కొన్నాళ్లుగా చిత్రసీమలోని షూటింగ్ కార్యకలాపాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. తాజాగా తిరిగి సినిమా షూటింగ్ జరపుకోవడానికి దేశవ్యాప్తంగా కొన్ని మార్గదర్శకాలు నిర్ణయించారు. ఫలితంగా చిత్రీకరణను తిరిగి ప్రారంభించడానికి దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారు.
జులైలో రామోజీ ఫిలింసిటీలో 'ముంబయి సాగా' షూటింగ్!
కరోనా వైరస్ కారణంగా అన్ని సినిమా షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా చిత్రీకరణలు జరుపుకోవడానికి ఇప్పుడిప్పుడే అనుమతులు వస్తున్నాయి. తాజాగా ఇమ్రాన్ హష్మి, జాన్ అబ్రహం ప్రధానపాత్రల్లో నటిస్తోన్న 'ముంబయి సాగా' ఈనెల 15 నుంచి షూటింగ్ ప్రారంభించుకోనున్నట్లు సమాచారం.
జాన్ అబ్రహం, ఇమ్రాన్ హష్మి కలిసి నటిస్తున్న గ్యాంగస్టర్ చిత్రం 'ముంబయి సాగా'. జులైలో హైదరాబాద్‌లో 12 రోజుల షెడ్యూల్‌తో రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరపుకోనుందని సమాచారం. సినిమా షూటింగ్‌కు కావాల్సిన సకలసౌకర్యాలు ఫిలింసిటీలో ఉన్నందున షూటింగ్ ప్రారంభించడానికి అనుకూలంగా భావించి చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకుందట. తెలంగాణ ప్రభుత్వం జూన్ 15 నుంచి చిత్రీకరణలకు అనుమతి ఇచ్చింది.
యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా సంజయ్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్ అబ్రహం గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇమ్రాన్ హష్మి ఇన్‌స్పెక్టర్ అంబర్ ఖాన్‌గా కనిపించనున్నాడు. టీ-సీరీస్, ఫెదర్ ఫిల్మ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రంలో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్, రోహిత్ రాయ్, ప్రతీక్ బబ్బర్, గుల్షన్ గ్రోవర్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్, ట్రైలర్ విడుదలై ఆకట్టుకున్నాయి. కరోనావైరస్ రాకుండా ఉంటే జూన్ 19న చిత్రం తెరపైకి రావాల్సి ఉంది.