సోషల్‌మీడియాలో నకిలీ ఫాలోవర్స్ స్కామ్‌లో భాగంగా ప్రముఖ ర్యాపర్ బాద్షాకు ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ కేసులో స్టేట్మెంట్ను రికార్డు చేసేందుకు క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు కావాలని అతడికి చెప్పారు. కొన్ని వారాల క్రితం సామాజిక మాధ్యమాల్లో నకిలీ, పెయిడ్ ఫాలోవర్స్‌కు సంబంధించిన విషయమై ముంబయి పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ రాకెట్లో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల్లో ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె ఉన్నారని ఇటీవలే వార్తలు వచ్చాయి. వీరితో పాటు ప్రముఖ బిల్డర్లు, క్రీడాకారులూ ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
దర్యాప్తు బృందం ఏర్పాటు
"ఈ రాకెట్‌కు సంబంధించిన దర్యాప్తులో మేము 54 సంస్థలను గుర్తించాం. సైబర్‌సెల్‌తో పాటు క్రైమ్ బ్రాంచ్‌తో కలిపి ఓ సిట్‌ను ఏర్పాటు చేశాం. ఈ కేసు దర్యాప్తులో ఇది సహాయపడుతుంది"