బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలీకి ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇదే విషయమై కంగన వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. శివసేన తనను చాలా మిస్సవుతుందని, త్వరలోనే ముంబయికి తిరిగొస్తానని అందులో రాసుకొచ్చింది.
మత విద్వేషాలను రెచ్చగొట్టేలా కంగన ట్వీట్స్ చేస్తోందని అందిన ఫిర్యాదు మేరకు, ఆమెపై కేసు పెట్టాలని ముంబయి కోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా కంగనకు సమన్లు జారీ చేశారు. అక్టోబరు 26-27 మధ్య ఆమె కోర్టు ముందు హాజరు కానుంది.