బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌కు ముంబయి నేర విభాగ పోలీసులు సమన్లు జారీ చేశారు. గతంలో నటి కంగనా రనౌత్ నమోదు చేసిన ఈ-మెయిల్ కేసులో భాగంగా నోటీసులు అందించినట్లు.. ఫిబ్రవరి 27న హృతిక్ వాంగ్మూలాన్ని స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. కంగన నకిలీ ఖాతా నుంచి తనకు బెదిరింపు మెయిళ్లొచ్చాయని 2016లో హృతిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ సమయంలో కంగన, హృతిక్ మధ్య వివాదం చెలరేగింది. ఒకరికొకరు లీగల్ నోటీసులిచ్చుకున్నారు. గతేడాది డిసెంబరులో హృతిక్ న్యాయవాది అభ్యర్థన మేరకు సైబర్ విభాగం నుంచి నేర విభాగానికి ముంబయి పోలీసులు బదిలీ చేశారు.