బాలీవుడ్ నటుడు, రచయిత జైషాన్ క్వాద్రిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.1.5 కోట్ల మేర మోసం చేశాడని తనపై సహనిర్మాత జతిన్ సేథి పోలీసులను ఆశ్రయించాడు. క్వాద్రి రూపొందించే ఓ వెబ్‌సిరీస్‌ను నిర్మించేందుకు జతిన్‌తో పాటు అతని స్నేహితుడొకరు పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ వెబ్‌సిరీస్ తాలూకా పెట్టుబడులను తిరిగి ఇవ్వడంలో జైషాన్ విఫలమయ్యాడని జతిన్ సేథి ఫిర్యాదులో పేర్కొన్నాడు.
'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్' నటుడిపై కేసు నమోదు - FIR registered on zeishan quadri
'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్' రచయిత, నటుడు జైషాన్ క్వాద్రిపై కేసు నమోదైంది. జైషాన్ రూపొందిస్తున్న వెబ్‌సిరీస్‌లో పెట్టుబడులు పెట్టిన సహనిర్మాత జతిన్ సేథి.. తనకు రావాల్సిన రూ. 1.5 కోట్లను ఇవ్వకుండా మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించాడు.
!['గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్' నటుడిపై కేసు నమోదు Mumbai Police files FIR against actor Zeishan Quadri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9743613-thumbnail-3x2-hd.jpg)
జతిన్ సేథి అనే సహనిర్మాత.. జైషాన్ తనను రూ.1.5 కోట్ల ఫైనాన్స్‌తో మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో జైషాన్ క్వాద్రిపై భారతీయ శిక్షాస్మృతి ప్రకారం చీటింగ్ (420)తో పాటు క్రిమినల్ ట్రస్ట్ ఉల్లంఘన (406) కింద కేసు నమోదైంది. ఫిర్యాదు ప్రకారం గడువులోగా క్వాద్రి డబ్బును తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యాడని.. ఆ తర్వాత ఇచ్చిన చెక్కులు ఇచ్చినా, అవి బౌన్స్ అయ్యాయని జతిన్ తెలిపాడు. దీనిపై అంబోలి పోలీసులు ప్రాథమిక విచారణ చేపడుతున్నారు.
అనురాగ్ కశ్యప్ రూపొందించిన సినిమా.. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్'లో జైషాన్ క్వాద్రి సహరచయితగా వ్యవహరిస్తూ.. అందులో నటించాడు.