బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కించుకున్న సందర్భంగా.. సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే ఈ నటుడికి వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పిందిముంబయి పోలీసు శాఖ.
"దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కించుకున్న 'ఇన్స్పెక్టర్ విజయ్'కు శుభాకాంక్షలు. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలతో మెప్పించి, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచిన మీకు సెల్యూట్ చేస్తున్నాం" -ముంబయి పోలీసు సిబ్బంది ట్వీట్