ప్రముఖ నటుడు సోనూసూద్‌పై ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కేసు పెట్టింది. ఆరు అంతస్థుల నివాస సముదాయాన్ని హోటల్‌గా మార్చడమే ఇందుకు కారణంగా పేర్కొంది.
లాక్డౌన్లో ఎంతోమందిని వారి స్వస్థలాలకు చేర్చి, ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు సోనూసూద్. ఆ తర్వాత కూడా మహిళలు, విద్యార్థులతో పాటు సాయం అడిగిన వారికి తోడుగా నిలిచారు.