బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ముంబయి కోర్టు.. పోలీసులను ఆదేశించింది. ట్వీట్లతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని తెలిపింది. క్యాస్టింగ్ డైరెక్టర్, ఫిట్నెస్ ట్రైనర్ మున్వల్ అలీ సయ్యద్ చేసిన ఫిర్యాదు మేరకు కంగనతో పాటు ఆమె సోదరి రంగోలీ చండేల్‌పై కేసు పెట్టారు.
నటి కంగనా రనౌత్‌పై మరో కేసు - కంగన పోలీస్ కేసు
ఇటీవలే వ్యవసాయ బిల్లు విషయంలో నటి కంగనా రనౌత్‌పై కేసు నమోదైంది. తాజాగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఈమెతో పాటు సోదరి రంగోలీపైనా ముంబయి పోలీసులు కేసు పెట్టారు.
నటి కంగనా రనౌత్‌పై మరో కేసు నమోదు
కంగన, రంగోలీ.. ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా ద్వారా దేశంలోని పలు సంఘాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తూ, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని సయ్యద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇవీ చదవండి: