90వ దశకంలో 'శక్తిమాన్'తో భారత ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచాడు నటుడు ముఖేష్ ఖన్నా. టెలివిజన్ చరిత్రలో సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ పాపులర్ షోను మూడు చిత్రాలుగా మార్చడానికి ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు.
"త్వరలోనే నా కల నెరవేరనుంది. ఇండియన్ సూపర్‌హీరోగా పేరొందిన 'శక్తిమాన్'ను నేను 'సూపర్ టీచర్' అని పిలుస్తా. మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఇదో ఎవర్గ్రీన్ కథాంశంతో రూపొందింది. చీకటి.. కాంతిని ఆక్రమించినట్లు సత్యాన్ని అధిగమించడానికి చాలా శక్తులు ప్రయత్నిస్తాయి. కానీ, చివరికి సత్యమే విజయం సాధిస్తుంది. ఒక తరం మొత్తం 'శక్తిమాన్' చూస్తూ పెరిగారు. ఇప్పుడు 'శక్తిమాన్ 2.0' వస్తోందని చెప్పడానికి సంతోషిస్తున్నా. అభిమానులను కలిసినప్పుడల్లా నేను వారికి విజయీభవ అని చెబుతాను. ఇప్పుడు అది నాకూ అవసరమని భావిస్తున్నా."