తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'7 డేస్ 6 నైట్స్' సినిమా అంతకు మించి: ఎంఎస్​ రాజు - మూవీ న్యూస్

తన కొత్త సినిమా, తొలి చిత్రం 'డర్టీ హరి'ని మించి ఉంటుందని అన్నారు దర్శకనిర్మాత ఎంఎస్ రాజు. వచ్చే నెల మొదటి వారం నుంచి దీని షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

MS raju new movie titled as '7 days 6 nights'
ఎంఎస్​ రాజు

By

Published : May 9, 2021, 8:22 PM IST

ఎన్నో హిట్‌ చిత్రాలు నిర్మించిన ఎం.ఎస్‌. రాజు ఇటీవల దర్శకుడిగా మారి ‘డర్టీ హరి’ చిత్రం తెరకెక్కించారు. ఈ సినిమా అందించిన విజయంతో మరో ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభించనున్నారు. మే 10న తన పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకు '7 డేస్‌ 6 నైట్స్‌' టైటిల్‌ ఖరారు చేశారు. వైల్డ్‌ హనీ ప్రొడక్షన్‌ పతాకంపై ఎంఎస్‌ రాజు తనయుడు, నటుడు సుమంత్‌ అశ్విన్‌, ఎస్‌. రజనీకాంత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

'ఈ సినిమా యువతతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నేపథ్యంలో సాగుతుంది. గతేడాది వచ్చిన 'డర్టీ హరి'తో నా జీవితం కొత్త మలుపు తీసుకుంది. 'డర్టీ హరి'ని మించి ఈ చిత్రం ఉంటుంది' అని ఎం.ఎస్‌.రాజు చెప్పారు. 'ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించిన మా నాన్నగారి సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ '7 డేస్ 6 నైట్స్' సినిమాను సమర్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది. జూన్ 7న చిత్రీకరణ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాం. ప్రస్తుతానికి నటీనటుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం' అని సుమంత్ అశ్విన్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details