తెలుగు చలన చిత్రసీమలో 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా' లాంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న దర్శక నిర్మాత ఎం.ఎస్.రాజు. ఇప్పుడు రొమాంటిక్ ప్రేమకథతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు 'డర్టీ హరి' అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ఎంఎస్ రాజు 'డర్టీ హరి' ఫస్ట్‌లుక్ ఇదిగో - ఎంఎస్ రాజు
ఎంఎస్ రాజు దర్శకత్వంలో వస్తోన్న కొత్త చిత్రం 'డర్టీ హరి'. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
![ఎంఎస్ రాజు 'డర్టీ హరి' ఫస్ట్‌లుక్ ఇదిగో dirty](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5590225-thumbnail-3x2-vis.jpg)
ఫస్ట్‌లుక్
ఈ సినిమా ద్వారా శ్రావణ్ రెడ్డి హీరోగా పరిచయమవుతున్నాడు. టైటిల్‌కు తగ్గట్లే ఫస్ట్‌లుక్ ఉంది. ఎస్‌పీజే క్రియేషన్స్ పతాకంపై నిర్మితమయ్యే ఈ చిత్రానికి గూడూరి శివరామకృష్ణ, సతీష్ బాబు, సాయి పునీత్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇవీ చూడండి.. మహేశ్, అర్జున్.. విడుదల తేదీ చెప్పండయ్యా..!