>మెగాహీరో సాయితేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' నుంచి 'టీజర్ ఆఫ్ శ్లోకాస్' విడుదలైంది. సింగిల్స్ కోసం తాను తయారు చేసిన 108 శ్లోకాల పుస్తకం గురించి చెబుతూ కథానాయకుడు కనిపించారు. ఇందులో నభా నటేష్ హీరోయిన్. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈనెల 25న థియేటర్లలో సినిమా విడుదల కానుంది.
>రవితేజ-శ్రుతిహాసన్ 'క్రాక్' సినిమాలోని 'భలే తగిలావే బాలా' లిరికల్ వీడియో విడుదలైంది. తమన్ సంగీత సారథ్యంలో అనిరుధ్ పాడాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా చిత్రం థియేటర్లలోకి రానుంది.
>మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 'కాత్తువక్కుల రెండు కాదల్' చిత్ర షూటింగ్లో పాల్గొన్నారు. ఈ మేరకు వీడియోను ట్వీట్ చేశారు. ఇందులో నయనతార, సమంత హీరోయిన్లు. విఘ్నేశ్ శివన్ దర్శకుడు.
>అక్షయ్ కుమార్ 'బచ్చన్ పాండే'లోని కీలకపాత్ర కోసం 'మీర్జాపుర్' ఫేమ్ పంకజ్ త్రిపాఠిని ఎంపిక చేశారు. జాక్వెలిన్, కృతిసనన్ ఈ సినిమాలో కథానాయికలు. ఫరాద్ సమ్జీ దర్శకుడు. జనవరి నుంచి జైసల్మేర్‌లో షూటింగ్ ప్రారంభించనున్నారు.
>సమంత హోస్ట్‌గా ఉన్న 'సామ్ జామ్' టాక్ షోకు హీరోయిన్ రకుల్ ప్రీత్‌తో పాటు దర్శకుడు క్రిష్ హాజరయ్యారు. ఆ ఫొటోల్ని ట్వీట్ చేశారు.
>అజిత్ 'వాలిమై' కోసం సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. ఆ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
బచ్చన్ పాండే సినిమాలో పంకజ్ త్రిపాఠికి అవకాశం
సామ్ జామ్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్‌తో దర్శకుడు క్రిష్
వాలిమై సంగీత రూపొందించే పనిలో యువన్ శంకర్ రాజా
సఖి సినిమా బృందం నుంచి నటుడు ఆదికి పుట్టినరోజు శుభాకాంక్షలు