తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దసరాకు థియేటర్‌, ఓటీటీలో వచ్చే సినిమాలివే! - దసరాకు ఓటీటీల్లో విడుదలయ్యే టాలీవుడ్​ సినిమాలు

కరోనా భయం కొనసాగుతున్న వేళ థియేటర్లు తెరిస్తే ప్రేక్షకులు వస్తారా? మునుపటిలా వసూళ్లు ఉంటాయా? యాభై శాతం ప్రేక్షకులతో సినిమాలు గట్టెక్కుతాయా? - ఇలా ఎన్నెన్నో సందేహాలు నిర్మాతలను ఇప్పటికీ వెంటాడుతున్నాయి. దీంతో కొన్ని సినిమాలు థియేటర్లలో (Upcoming Movies In Telugu) విడుదలకు సిద్ధమైతే.. మరికొన్ని ఓటీటీల్లో (Upcoming Movies On OTT) ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. మరి ఈ దసరాకు ఏఏ మూవీలు రిలీజ్ అవుతున్నాయో చూద్దామా!

movies hitting theatres this Dussehra and ott
దసరాకు విడుదలయ్యే సినిమాలివే!

By

Published : Oct 13, 2021, 12:08 PM IST

దసరాకు అగ్రహీరోలు ఎవరూ బరిలో లేరు. కరోనా ప్రభావం తగ్గినా, ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు సుముఖంగా లేరు. అందుకే ఈ పండగకు స్టార్ హీరోల మెరుపులు కరవయ్యాయి. కుర్ర హీరోలు మాత్రం వసూళ్ల వేటలో సై అంటూ రంగంలోకి దూకుతున్నారు. దీంతో సినిమా హాళ్లలో యువహీరోల మధ్య పండగ పోటీ ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో (Upcoming Movies On OTT) పలకరించేందుకు సిద్ధమైన చిత్రాలేంటో (Upcoming Movies In Telugu) చూద్దాం.

మహా సముద్రం

లోతు కొలవలేనంత ప్రేమ 'మహా సముద్రం'లో ఉందంటున్నారు హీరోలు సిద్ధార్థ్‌, శర్వానంద్‌ (Mahasamudram Movie Cast). వాళ్లిద్దరూ స్నేహితులుగా నటిస్తున్న చిత్రమిది. అదితీ రావ్‌ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోహీరోయిన్లు. 'ఆర్‌ఎక్స్‌100' ఫేమ్‌ అజయ్‌ భూపతి తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రావు రమేశ్‌, జగపతిబాబు (Jagapathi Babu New Movie) కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు. దసరా కానుకగా అక్టోబరు 14న థియేటర్‌లో విడుదల కానుంది.

మహా సముద్రం

మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్​లర్‌

హీరోగా మూడు సినిమాలు చేసినప్పటికీ అఖిల్‌కు సరైన హిట్‌ పడలేదు. ఈ సారి మాత్రం కచ్చితంగా బ్లాక్‌ బస్టర్‌ కొడతాననే ధీమాతో ఉన్నాడీ అక్కినేని హీరో. అఖిల్‌, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్​లర్‌'. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన లభించింది. అక్టోబరు 15న (Most Eligible Bachelor Release Date) దసరా పండగ కానుకగా విడుదలవుతోంది. 'బొమ్మరిల్లు' భాస్కర్‌ దర్శకుడు. గోపి సుందర్‌ అందించిన బాణీలు యువతను అమితంగా ఆకట్టుకున్నాయి.

మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌

పెళ్లిసందD

సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌కు 'పెళ్లిసందడి' మైలురాయిలాంటి సినిమా. ఇప్పుడు అదే టైటిల్‌తో ఆయన తనయుడు రోషన్‌ హీరోగా 'పెళ్లిసందD' సినిమా చేశారు. గౌరి రోనంకి దర్శకత్వం వహించారు. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కింది. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించారు. ఇది కూడా దసరా కానుకగా అక్టోబరు 15న (Pelli Sandad Release Date)థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గతంలో వచ్చిన 'పెళ్లిసందడి' చిత్రానికి సంగీతమందించిన కీరవాణి ఈ సినిమాకు కూడా పనిచేశారు. చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. ఈ సినిమాతోనే దర్శకేంద్రుడు నటుడిగా మారి, ఓ కీలక పాత్రలో నటించారు.

పెళ్లిసందD

వెనమ్‌: లెట్‌ దేర్‌ బీ కార్నేజ్‌

హాలీవుడ్ చిత్రం 'వెనమ్' కూడా ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైంది. భారత్​లో అక్టోబర్ 14న ఈ సినిమా రిలీజ్ కానుంది.

వెనమ్‌: లెట్‌ దేర్‌ బీ కార్నేజ్‌

ఓటీటీలో అలరించనున్న చిత్రాలు

సర్దార్‌ ఉద్దమ్

విక్కీ కౌశల్‌ (Vicky Kaushal New Movie) కీలక పాత్రలో సూజిత్‌ సిర్కార్‌ దర్శకత్వం వహించిన హిస్టారికల్‌ డ్రామా 'సర్దార్ ఉద్దమ్‌' (Sardar Udham Singh Movie). విక్కీ ఇందులో టైటిల్‌ రోల్‌ పోషించాడు. ప్రముఖ ఓటీటీ (OTT Movie Release) అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా అక్టోబరు 16న ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. జలియన్‌ వాలాబాగ్‌ ఉదంతం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. జలియన్‌ వాలాబాగ్‌లో సమావేశమైన స్వాతంత్య్ర సమరయోధులపై బ్రిటిష్ అధికారి, జనరల్ డయ్యర్‌ తన సైన్యంతో వచ్చి, తుపాకీ గుళ్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో మొత్తం వెయ్యికు పైగా భారతీయులు మృత్యువాతపడ్డారు. భారతదేశ చరిత్రలో అదొక చీకటిదినంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. వందల మంది మృతికి కారణమైన జనరల్‌ డయ్యర్‌ను విప్లవకారుడైన ఉద్దమ్‌ సింగ్‌ కాల్చి చంపాడు. అనంతరం ఉరిశిక్ష అనుభవించాడు. ఇప్పుడు ఈ కథతోనే విక్కీ-సూజిత్‌ సర్కార్‌లు 'సర్దార్‌ ఉద్దమ్‌' తెరకెక్కించారు.

సర్దార్‌ ఉద్దమ్

రష్మీ రాకెట్‌

'థప్పడ్‌', 'హసీనా దిల్‌రుబా', 'అనబెల్‌ సేతుపతి'.. ఇలా వరుస ఓటీటీ రిలీజ్‌లతో దూసుకెళ్తున్నారు నటి తాప్సీ పన్ను. తాజాగా 'రష్మీ రాకెట్‌'తో ఓటీటీ వేదికగా మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు ఆమె సిద్ధమయ్యారు. ఆమె ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 15న జీ5 ఓటీటీ వేదికగా విడుదలవుతుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ గుజరాత్‌ అథ్లెట్‌ రష్మీ పాత్రలో కనిపించనున్నారు. ఆకర్ష్‌ ఖురానా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రోనీ స్ర్కూవాలా, నేహా, ప్రంజల్‌ సంయుక్తంగా నిర్మించారు.

రష్మీరాకెట్‌

నెట్‌ఫ్లిక్స్‌

  • ది ఫోర్‌ ఆఫ్‌ అజ్‌ - అక్టోబరు 15
  • ది ట్రిప్‌ - అక్టోబరు 15
  • లిటిల్‌ థింగ్స్‌ - అక్టోబరు 15
  • యు - అక్టోబరు 15

అమెజాన్‌ ప్రైమ్‌

  • రక్తసంబంధం - అక్టోబరు 14
  • ఫ్రెండ్‌షిప్ - అక్టోబరు 15
  • ఐనో వాటు యు డిడ్‌ లాస్ట్‌ సమ్మర్‌ - అక్టోబరు 15

డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌

  • సీటీమార్‌ - అక్టోబరు 15
  • ఫ్రీ గై - అక్టోబరు 15
  • సనక్‌ - అక్టోబరు 15

ఇదీ చూడండి:పూజా హెగ్డే సొగసుల వల.. అభిమానుల విల విల!

ABOUT THE AUTHOR

...view details