Movie Updates: చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'గాడ్‌ఫాదర్'. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ నిర్మాతలు. బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్‌ఖాన్ ఇందులో ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఇటీవలే కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ముంబయి వెళ్లింది చిత్రబృందం. సోమవారంతో అక్కడ షెడ్యూల్ పూర్తయినట్టు తెలిపాయి సినీవర్గాలు. "రాజకీయం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథ ఇది. చిరంజీవితో, సల్మాన్‌ఖాన్‌లు శక్తిమంతమైన పాత్రల్లో కనిపిస్తారు. ముంబయిలో ఆ ఇద్దరిపై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించాం. అభిమానులకి పండగలా ఉంటాయి ఆ సన్నివేశాలు. త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలవుతుంది" అని తెలిపాయి సినీ వర్గాలు. ఇందులో ప్రముఖ కథానాయిక నయనతార ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: కొణిదెల సురేఖ, సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: నీరవ్‌షా.
'జాతిరత్నాలు' సినిమాతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు దర్శకుడు కేవీ అనుదీప్. ఇప్పుడాయన శివ కార్తికేయన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలోరూపొందుతోంది. దీన్ని నారాయణ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్‌రావు, సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథా నాయికగా ఉక్రెయిన్ నటి మరియా ర్యాబోషప్క ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. మారియా ఇప్పటికే రెండు ఉక్రెనియన్ సినిమాల్లో నటించింది. అలాగే భారతీయ వెబ్‌సిరీస్ 'స్పెషల్ ఆఫ్ల్సో'లోప్రధాన పాత్ర పోషించి.. మెప్పించింది. "పుదుచ్చేరి, లండన్ నేపథ్యాలలో సాగే విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. వినోదభరితంగా సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది.ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది" అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి తమన్ స్వరాలందిస్తున్నారు.