తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వైష్ణవ్​తేజ్ 'కొండపొలం'.. సెట్​లోకి ఆలియా ఎంట్రీ - వివాహ భోజనంబు ఓటీటీ

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో కొండపొలం, రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, మెరిసే మెరిసే, తరగతి గది దాటి, వివాహ భోజనంబు చిత్రాల సంగతులు ఉన్నాయి.

Movie updates
మూవీ అప్డేట్స్

By

Published : Aug 20, 2021, 10:56 AM IST

Updated : Aug 20, 2021, 12:20 PM IST

*'ఉప్పెన'తో ఆకట్టుకున్న వైష్ణవ్​తేజ్ రెండో సినిమాకు 'కొండపొలం' టైటిల్​ నిర్ణయించారు. ఫస్ట్​లుక్​ టీజర్​ను శుక్రవారం విడుదల చేశారు. అడ్వెంచర్​ లవ్​స్టోరీగా, 'కొండపొలం' నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రకుల్ ప్రీత్ హీరోయిన్. క్రిష్ దర్శకత్వం వహించారు. కీరవాణి సంగీత దర్శకుడు. అక్టోబరు 8న థియేటర్లలోకి రానుందీ చిత్రం.

.

*ఆలియా భట్ కొత్త సినిమా సెట్​లో అడుగుపెట్టేసింది. శుక్రవారం నుంచి షూటింగ్ ప్రారంభమైంది. 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రణ్​వీర్​ సింగ్ హీరోగా నటిస్తున్నారు. కరణ్​ జోహార్​ చాలారోజుల తర్వాత ఈ సినిమాతో దర్శకుడిగా రీఎంట్రీ ఇస్తున్నారు.

*హాస్యనటుడు సత్య హీరోగా నటించిన 'వివాహ భోజనంబు'.. ఓటీటీలో ఈ నెల 27న విడుదల కానుందని ప్రకటించారు. 'ప్లేబ్యాక్' ఫేమ్ దినేశ్​ తేజ్ కొత్త చిత్రం 'మెరిసే మెరిసే'.. అమెజాన్ ప్రైమ్​ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

.
.
.

ఇవీ చదవండి:

Last Updated : Aug 20, 2021, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details