తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బెల్లంకొండ 'ఛత్రపతి'కి టైమ్​ ఫిక్స్.. సింగర్​గా శర్వానంద్ - nithiin maestro

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఛత్రపతి హిందీ రీమేక్, శర్వానంద్ ఒకే ఒక జీవితం, సమ్మతమే, మాస్ట్రో చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

oke oka jeevitham motion poster, chatrapathi hindi remake
మూవీ న్యూస్

By

Published : Jul 15, 2021, 6:59 PM IST

*బెల్లంకొండ శ్రీనివాస్​ తొలి హిందీ సినిమాకు ముహుర్తం ఖరారైంది. హైదరాబాద్​లో శుక్రవారం ఉదయం పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభం కానుంది. ప్రభాస్-రాజమౌళి కాంబోలో వచ్చిన 'ఛత్రపతి' రీమేక్​గా దీనిని తెరకెక్కిస్తున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతిలాల్ గడా నిర్మిస్తున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్​

*శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' మోషన్ పోస్టర్ వచ్చేసింది. ఇందులో శర్వా సింగర్​గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. రీతూ వర్మ హీరోయిన్​గా నటిస్తోంది. అమల అక్కినేని కీలకపాత్రలో కనిపించనున్నారు. శ్రీ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

*నితిన్ 'మాస్ట్రో' నుంచి తొలి లిరికల్ ప్రోమో వచ్చేసింది. 'బేబీ ఓ బేబీ' అంటూ సాగుతున్న దీని పూర్తి గీతం.. శుక్రవారం ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నారు. హిందీ బ్లాక్​బస్టర్ 'అంధాధున్' రీమేక్​గా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నభా నటేష్, తమన్నా కీలకపాత్రల్లో నటించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. త్వరలో విడుదల తేదీపై స్పష్టత రానుంది.

*యువహీరో కార్తిక్ అబ్బవరం 'సమ్మతమే' ఫస్ట్​లుక్ వచ్చేసింది. కూల్​గా ఉన్న ఈ పోస్టర్​ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. 'లవ్ ఈజ్ అన్​ కండీషనల్' అనే ట్యాగ్​లైన్​ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చాందిని చౌదరి హీరోయిన్​గా చేస్తోంది. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

సమ్మతమే ఫస్ట్​లుక్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details