తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కొత్త అప్​డేట్స్: షెర్లీ టాలీవుడ్​ ఎంట్రీ​ - గెటప్ శ్రీను రాజు యాదవ్ సినిమా

కొత్త సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. బ్యూటీ షెర్లీ షెటియా తెలుగులో తొలి సినిమా చేస్తోంది. అలానే శింబు 'మానాడు', 'ఓదెల రైల్వేస్టేషన్​' నుంచి కూడా అప్​డేట్స్ విడుదల చేశారు.

movie updates latest
నటి షెర్లీ షెటియా

By

Published : Nov 21, 2020, 4:49 PM IST

ప్రముఖ సింగర్, నటి షెర్లీ షెటియా టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. హీరో నాగశౌర్య కొత్త సినిమాలో ఈమె హీరోయిన్​గా ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్రబృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు అనీష్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

నటి షెర్లీ షెటియా

నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'ఓదెల రైల్వేస్టేషన్​' సినిమాలోని మరో లుక్​ విడుదలైంది. నటుడు వశిష్ట సింహా ఇందులో ఇస్త్రీవాడిగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. హెబ్బా పటేల్ హీరోయిన్. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు.

ఓదెల రైల్వేస్టేషన్​ సినిమాలో వశిష్ట సింహా లుక్

'జబర్దస్త్' ఫేమ్ గెటప్​ శ్రీను హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'రాజు యాదవ్' లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు వేణు ఊడుగుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నారు.

గెటప్ శ్రీను 'రాజు యాదవ్' చిత్ర ప్రారంభోత్సవం

శింబు హీరోగా నటిస్తున్న తమిళ సినిమా 'మానాడు' ఫస్ట్​లుక్ విడుదలైంది. ఇందులో అబ్దుల్​గా కనిపిస్తున్న శింబు పోస్టర్ ఆకట్టుకుంటోంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తుండగా, యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు.

శింబు మానాడు సినిమా ఫస్ట్​లుక్

ABOUT THE AUTHOR

...view details