తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాగ్​ 'ఘోస్ట్​' లుక్​ అదుర్స్​.. 'సామాన్యుడు'గా విశాల్​ - విశాల్​ కొత్త సినిమా

టాలీవుడ్​ కొత్త సినిమాల అప్​డేట్స్​ వచ్చేశాయి. ఆదివారం(ఆగస్టు 29) పుట్టినరోజు (Nagarjuna Birthday) జరుపుకొంటున్న కథానాయకులు అక్కినేని నాగార్జున, విశాల్​ కొత్త సినిమాల టైటిల్స్​తో పాటు ఫస్ట్​లుక్​ అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి.

nagarjuna ghost movie, నాగార్జున కొత్త సినిమా
నాగ్​ 'ఘోస్ట్​'లుక్​ అదుర్స్​.. 'సామాన్యుడు'గా విశాల్​

By

Published : Aug 29, 2021, 2:13 PM IST

అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్​ సత్తారు​ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్ర టైటిల్​ను 'ది ఘోస్ట్​'​గా(Nagarjuna Ghost Movie) ఖరారు చేశారు. నాగ్​ పుట్టినరోజు (Nagarjuna Birthday) సందర్భంగా ఆదివారం ఉదయం ఈ సినిమా టైటిల్​ను చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్ర టైటిల్​, ఫస్ట్​లుక్​ పోస్టర్​ను.. హీరోయిన్​ కాజల్​ అగర్వాల్​ సోషల్​ మీడియాలో విడుదల చేసింది. పూర్తిస్థాయి యాక్షన్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్​టైన్​మెంట్స్​​, వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న 'బంగార్రాజు'(Bangarraju) షూటింగ్​ ఇటీవలే ప్రారంభమైంది.

'ది ఘోస్ట్​' ఫస్ట్​లుక్

'సామాన్యుడు'గా విశాల్​..

కోలీవుడ్​ స్టార్​ హీరో విశాల్​ కొత్త సినిమా అప్​డేట్​ వచ్చేసింది. విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం ప్రకటించింది. నూతన దర్శకుడు శరవణన్​ రూపొందిస్తున్న ఈ చిత్రానికి తెలుగులో 'సామాన్యుడు' అనే టైటిల్​ ఖరారైంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ (VFF) బ్యానర్‌పై విశాల్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'సామాన్యుడు' ఫస్ట్​లుక్

ఇంటెన్సివ్​ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ డింపుల్ హయాతి కథానాయిక. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఇదీ చూడండి :Fahadh Faasil: నజ్రియాతో ప్రేమ అలా స్టార్ట్​ అయ్యింది!

ABOUT THE AUTHOR

...view details