*'విరాటపర్వం'లోని తొలి సాంగ్ ప్రోమో విడుదలైంది. 'కోలు కోలు' అనే లిరిక్స్‌తో సాగే ఈ గీతం శ్రోతల్ని అలరిస్తోంది. రానా కామ్రేడ్ రవన్నగా, సాయిపల్లవి జర్నలిస్టుగా కనిపించనున్నారు. వేణు ఊడుగుల దర్శకుడు. ఏప్రిల్ 30న థియేటర్లలో సినిమా విడుదల కానుంది.
*'చావు కబురు చల్లగా' నుంచి 'కదిలే కాలన్ని అడిగా' లిరికల్ గీతం రిలీజ్ అయింది. ఈ సినిమాలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లు. కౌశిక్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మార్చి 19న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.