తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'టక్​ జగదీష్' టీజర్ కౌంట్​డౌన్.. వైజాగ్​కు 'పాగల్' - హీరో విశ్వక్​సేన్

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో టక్ జగదీష్, పాగల్, విరాటపర్వం, బచ్చన్ పాండే చిత్రాల సంగతులు ఉన్నాయి.

movie updates from tuck jagadish, paagal, bachchan pandey, virata parvam
నాని విశ్వక్​సేన్

By

Published : Feb 22, 2021, 5:40 PM IST

*నాని 'టక్​ జగదీష్' టీజర్​ మంగళవారం(ఫిబ్రవరి 23) సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేయనున్నారు. రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. శివ నిర్వాణ దర్శకుడు.

టక్​ జగదీష్​ సినిమా నాని

*రానా-సాయిపల్లవి నటిస్తున్న 'విరాటపర్వం' తొలి లిరికల్​ సాంగ్.. ఈనెల 25న విడుదల కానుంది. ఈ విషయాన్ని చెబుతూ కొత్త పోస్టర్​ను పంచుకుంది చిత్రబృందం. ఇందులో కామ్రేడ్ రవన్న పాత్రలో రానా కనిపించనున్నారు. వేణు ఊడుగుల దర్శకుడు.

విరాటపర్వం సినిమాలో సాయిపల్లవి

*విశ్వక్​సేన్ 'పాగల్' చిత్రీకరణ కోసం వైజాగ్​ వెళ్లారు. ప్రేమకథతో తీస్తున్న ఈ సినిమా టీజర్​ ఇటీవల విడుదలై అభిమానుల్ని అలరిస్తోంది. నరేశ్​ కుప్పిలి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఏప్రిల్ 30న థియేటర్లలో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

హీరో విశ్వక్​సేన్

*'బచ్చన్​పాండే' సెట్​లో అడుగుపెట్టింది నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ సందర్భంగా హీరో అక్షయ్ కుమార్​తో దిగిన ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. వచ్చే ఏడాది జనవరిలో సినిమా విడుదల కానుంది. ఇందులో అక్షయ్ గ్యాంగ్​స్టర్​గా కనిపించనున్నారు. ఫర్హాద్ సంజీ దర్శకుడు.

బచ్చన్​ పాండే సెట్​లో అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్

*దర్శక ద్వయం రాజ్-డీకే తీస్తున్న వెబ్​ సిరీస్​లో నటిస్తున్న రాశీఖన్నా.. వాళ్లతో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ సిరీస్​లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలో షూటింగ్ జరుగుతోంది.

దర్శకులు రాజ్​ డీకేతో రాశీఖన్నా

ఇది చదవండి:20 ఏళ్ల తర్వాత 'చిత్రం'కు సీక్వెల్.. తేజ ప్రకటన

ABOUT THE AUTHOR

...view details