*'భాగ్ మిల్కా భాగ్' దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఫర్హాన్ అక్తర్.. మరోసారి ఆ మ్యాజిక్‌ను పునరావృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రాతో కలిసి 'తుఫాన్' చేస్తున్నారు. బాక్సింగ్ నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమా టీజర్‌ను, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు.. శుక్రవారం ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
'తుఫాన్' టీజర్.. ముందే వస్తున్న 'గాడ్జిల్లా vs కాంగ్' - toofan teaser
కొత్త సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో తుఫాన్ టీజర్, ముంబయి సాగా, గాడ్జిల్లా vs కాంగ్ విడుదల తేదీలు ఉన్నాయి.
'తుఫాన్' టీజర్.. ముందే వస్తున్న 'గాడ్జిల్లా vs కాంగ్'
*హాలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్'.. అనుకున్న తేదీ కంటే రెండు రోజుల ముందు అంటే మార్చి 24న భారత్‌లో విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో థియేటర్లలో సందడి చేయనుంది.
*'ముంబయి సాగా' వాయిదా పడిందనే వార్తలపై దర్శకుడు సంజయ్ గుప్తా స్పందించారు. ప్రణాళిక ప్రకారం మార్చి 19న వెండితెరపైకి రానుందని అన్నారు.