>నేచురల్ స్టార్ నాని 'శ్యామ్ సింగరాయ్' సినిమా గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్లు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. ఈ నెల నుంచే షూటింగ్ ప్రారంభించనున్నారు.
>విజయ్ సేతుపతి, సమంత, నయనతారల సినిమా 'కాత్తువక్కుల రెండు కాదల్'.. పూజా కార్యక్రమం, షూటింగ్ గురువారమే మొదలైంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు.
>'అంతిమ్' సినిమాలో హీరో సల్మాన్‌ఖాన్ ఫస్ట్‌లుక్ వీడియో విడుదలైంది. ఇందులో సల్మాన్ సిక్కు పోలీస్‌గా నటిస్తున్నారు. ఆయుష్ శర్మ కథానాయకుడు. మహేశ్ మంజ్రేకర్ దర్శకుడు.
>బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తున్న 'బాబ్ బిశ్వాస్' షూటింగ్ ముగిసింది. కోల్‌కతాలో ఒకే షెడ్యూల్లో 43 రోజుల్లోనే దీనిని పూర్తి చేయడం విశేషం. చిత్రాంగద సింగ్ హీరోయిన్. దియా అన్నపూర్ణ ఘోష్ దర్శకురాలు.
> సాయిధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' టైటిల్ గీతం.. శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల కానుంది. డిసెంబరు 25న సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.
>రవితేజ 'క్రాక్' చిత్రంలోని రెండో గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ పాడారు. దీనిని ఈనెల 14న విడుదల చేయనున్నారు.
>సుశాంత్.. తాను నటించిన 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' సినిమాకు డబ్బింగ్ చెబుతున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
>శ్రీనివాసరెడ్డి, సప్తగిరి హీరోగా 'హౌస్ అరెస్టు' టైటిల్‌తో సినిమా తీస్తున్నారు. గురువారం దీనిని లాంఛనంగా ప్రారంభించారు. దర్శకుడు బాబీ క్లాప్ కొట్టారు.
నాని శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రారంభం కొత్త సినిమా కోసం సిక్కు గెటప్‌లో సల్మాన్‌ఖాన్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో సాయిధరమ్ తేజ్ కాత్తువక్కుల రెండు కాదల్ సినిమా ప్రారంభం క్రాక్ రెండో పాట పాడిన అనిరుధ్ బాబ్ బిశ్వాస్ చిత్రీకరణ పూర్తి డబ్బింగ్ చెబుతున్న హీరో సుశాంత్ శ్రీనివాసరెడ్డి, సప్తగిరిల హౌస్ అరెస్టు సినిమా