*'శాకుంతలం' సినిమా కోసం హీరోయిన్ సమంత రంగంలోకి దిగింది. ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా ఆధ్వర్యంలో ఆమె మేకప్ టెస్టు జరుగుతోంది. కాళీదాసు 'శాకుంతలం' ఆధారంగా ఈ ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
*'కంబాలపల్లి కథలు' వెబ్ సిరీస్లో తొలి భాగం 'మెయిల్' ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఉదయ్ గుర్రాల దర్శకుడు. ఈనెల 12 నుంచి ఆహా ఓటీటీలో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.