తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తెలుగు ట్రైలర్​తో 'షకీలా'.. 'రెడ్' రిలీజ్ ఫిక్స్ - amrin qureshi bollywood debut

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'షకీలా', రెడ్, సోలో బ్రతుకే సో బెటర్, జాతిరత్నాల చిత్రాల సంగతులు ఉన్నాయి.

movie updates from shakeela, red, solo brathuke so better, jathi ratnalu
తెలుగు ట్రైలర్​తో 'షకీలా'.. 'రెడ్' రిలీజ్ ఫిక్స్

By

Published : Dec 26, 2020, 5:50 PM IST

*రామ్ 'రెడ్' సినిమా విడుదల తేదీ ఖరారైంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సెన్సార్​లో యూ/ఏ సర్టిఫికెట్​ పొందినట్లు కొత్త పోస్టర్​ను పోస్ట్ చేశారు.

*థియేటర్లలో తిరిగి తెరుచుకున్న తర్వాత శుక్రవారం విడుదలైన సాయితేజ్​ 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా డీసెంట్ కలెక్షన్లు రాబడుతోంది. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.4.7 కోట్లు, దేశవ్యాప్తంగా రూ.5.1 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

*శృంగార తార షకీలా జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా 'షకీలా'. తెలుగు ట్రైలర్​ను శనివారం విడుదల చేశారు. సినిమాను న్యూయర్​ సందర్భంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.

*'ఫాదర్ చిట్టి కార్తిక్ ఉమ' సినిమాలోని ప్రధాన పాత్రధారి జగపతిబాబు ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది.

*నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు కానుకగా అతడు నటిస్తున్న 'జాతిరత్నాలు' చిత్రంలోని కొత్త పోస్టర్​ రిలీజైంది. జైలులో దీనంగా కూర్చొన్న అతడి లుక్​ ఆకట్టుకుంటోంది.

*తెలుగమ్మాయి అమ్రిన్ ఖురేషి నటిస్తున్ తొలి బాలీవుడ్​ సినిమా 'బ్యాడ్​బాయ్'. హైదరాబాద్​లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

రామ్ రెడ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్
సాయితేజ్ సోలో బ్రతుకే సో బెటర్
జాతిరత్నాలు సినిమాలో నవీన్ పోలిశెట్టి
బ్యాడ్​బాయ్ సినిమా షూటింగ్​లో అమ్రిన్ ఖురేషి
జగపతిబాబు కొత్త లుక్

ABOUT THE AUTHOR

...view details