*బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్.. తన 'రాధే' సినిమా గురించి మాట్లాడారు. ఈ ఏడాది ఈద్‌కు థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు.
సల్మాన్ రాధే సినిమా విడుదలపై ట్వీట్ *అల్లరి నరేశ్, పూజా జావేరి జంటగా నటించిన 'బంగారు బుల్లోడు' ట్రైలర్ విడుదలైంది. గిరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 23న థియేటర్లలో రిలీజ్ కానుంది.
*పవన్ కల్యాణ్ 'వకీల్‌సాబ్'లోని 'మగువా మగువా' గీతం 40 మిలియన్ల వ్యూస్ దాటింది. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. ఇటీవల విడుదలైన టీజర్ కూడా అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
పవన్ కల్యాణ్ వకీల్‌సాబ్ సినిమా
*నాగచైతన్య చేతుల మీదుగా 'సూపర్ ఓవర్' ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రం ఆహా ఓటీటీలో ఈనెల 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. క్రికెట్ బెట్టింగ్ కథతో చిత్రం రూపొందించారు. నవీన్ చంద్ర, చాందిని చౌదిరి హీరోహీరోయిన్లుగా నటించారు.
*నాగశౌర్య, రీతూవర్మ 'వరుడు కావలెను' సినిమా నుంచి త్వరలో అప్డేట్ రానుంది. ఈనెల 22న ఉదయం హీరోకు సంబంధించిన పోస్టర్/టీజర్ విడుదలయ్యే అవకాశముంది.
నాగశౌర్య రీతూవర్మ వరుడు కావలెను సినిమా