తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గన్​తో రాజ్​ తరుణ్.. పెళ్లి కొడుకు గెటప్​లో సింహా - సుమంత్ అనగనగా ఓ రౌడీ సినిమా

కొత్త సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో రాజ్​ తరుణ్, సుమంత్, శ్రీసింహా కొత్త చిత్రాల సంగతులతో పాటు టామ్ అండ్ జెర్రీ విడుదల తేదీ ఉంది.

movie updates from Power play, thelavarithe guruvaram, anaganaga o rowdy, tom and jerry
గన్​తో రాజ్​ తరుణ్.. పెళ్లి కొడుకు గెటప్​లో సింహా

By

Published : Jan 14, 2021, 8:05 PM IST

*హాస్యభరిత, ఫ్యామిలీ ఎంటర్​టైన్​మెంట్స్ చేస్తూ వచ్చిన యువనటుడు రాజ్​తరుణ్.. తొలిసారి థ్రిల్లర్​ సినిమాలో నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా 'పవర్​ ప్లే' టైటిల్​తోపాటు మోషన్​ పోస్టర్​ను రానా విడుదల చేశారు. విజయ్ కుమార్ కొండా దర్శకుడు.

*సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు 'అనగనగా ఓ రౌడీ' పేరును ఖరారు చేశారు. మను దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

సుమంత్ అనగనగా ఓ రౌడీ సినిమా

*సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీసింహా నటిస్తున్న రెండో సినిమా 'తెల్లవారితే గురువారం'. పండగ కానుకగా పోస్టర్​ను విడుదల చేశారు. పెళ్లి కొడుకు గెటప్​లో కుర్చీపై బాధతో కూర్చొని ఉన్న సింహా లుక్​ ఆకట్టుకుంటోంది. ఇందులో చిత్రా శుక్లా హీరోయిన్​. మార్చిలో థియేటర్లలోకి రానుంది సినిమా.

శ్రీసింహా కొత్త సినిమా 'తెల్లవారితే గురువారం' సినిమా

*టామ్ అండ్ జెర్రీ సినిమా.. ఫిబ్రవరి 19 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని చిత్రబృందం గురువారం వెల్లడించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అలరిస్తోంది.

టామ్ అండ్ జెర్రీ విడుదల తేదీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details